Tuesday, March 31, 2026

పందుల దోపిడి కేసును చేదించిన ఆత్మకూరు పోలీసులు

  • దోపిడీ కేసులో నలుగురి నిందితుల రిమాండ్
  • ఒక బొలేరో వాహనం, 90. వేలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఆత్మకూరు పట్టణంలోని పరమేశ్వర స్వామి చెరువు కట్ట దగ్గర ఉన్న పందుల షెడ్డుపై ఆకస్మికంగా దాడి చేసి పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకోని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐ.పీ.ఎస్ తెలిపారు.పరమేశ్వర స్వామి చెరువు కట్ట సమీపంలో నీటి వసతి ఉన్నందున చెన్నయ్య అనే వ్యక్తి సెడ్డు వేసుకొని 73 పందులను పెంచుకుంటున్నాడు. అ క్రమంలో తేదీ. 16.02.2025 రోజున ఆత్మకూరు లోని చెరువు కట్ట దగ్గర బ్రిడ్జి కింద ఉన్న పందులను నేరస్తులు బింగిదొడ్డి అంజి(ఎ 4), మాదిరే మహేష్ (ఎ 8) నందవరం బాలరాజు(ఎ 9) లు ముగ్గురు వచ్చి రెక్కి నిర్వహించారు. అక్కడ పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నలకు సమాచారాన్ని చెరవేశారు. తేది. 17.02.2025 రోజున నేరస్తులు అందరు కలిసి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. ఎరుకలి సిద్దప్ప (ఎ 1) తన బొలెరో వాహనం తీసుకొని సింధానూర్ లో బయలుదేరి మార్గమద్యలో ఎరుకలి అంజి (ఎ 2) ఎరుకలి నాగరాజు ఎ 3ను ఎక్కించుకొని ఎమ్మిగనూర్ కు వచ్చి అక్కడ ఎరుకలి భీమన్న, గుల్లి నాగరాజు, కందేనతి సుంకన్న, మదిరె మహేష్, హోలిగుంది అంజి లు తేది 17.02.2025 రోజున అందరు కలిసి ఆ రోజు రాత్రి అందజ 01:10 గంటల సమయంలో ఆత్మకూరు లోని పందుల షెడ్డు వద్దకు వచ్చి 30 పందులను బొలెరోలో ఎక్కిస్తుండగా పందుల అరుపులు విని పందుల వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నిద్రలోనుండి లేచి ఎవర్రా మీరు మా పందుల వద్ద ఏం చేస్తున్నారు. అని అరుస్తూ పందుల దగ్గరకు వస్తుండగా అప్పటికే బొలెరో బండిలో ఉన్న నేరస్తులు భీమ హోలిగొంది అంజి మరియు, సుంకన్న మదిరె మహేష్ , సిరిగెరి నాగరాజు పందుల వద్దకు వస్తున్న ఇద్దరు వ్యక్తుల పైకి బొలెరో బండిలో వాళ్ళ వెంట తెచుకున్న గాజు సీసాలతో, రాళ్ళతో ఇద్దరి పైకి విసరగా ఇద్దరు వ్యక్తులకు కుడా బలమైన గాయాలు అయినాయి. వారి వద్ద ఉన్న సిల్ ఫోన్ లను గుంజుకొని తీసుకొని పోతూ ఫోన్ లను మార్గమద్యలో జూరాల డ్యాం లో పడేసి పందులను తీసుకొని సిద్ధప్ప అందరిని ఎమ్మిగనూర్ నందు వదిలిపెట్టి సిద్ధప్ప (ఎ 1) బెంగుళూరు వెళ్లి 90,000/-రూపాయలకు పందులను అమ్ముకున్నాడు.ఇట్టి నేరస్తులు ఇంతకుముందు వనపర్తి జిల్లా ఏదుట్ల గ్రామం గోపాల్ పేట మండలం, దొడగుంటపల్లి గ్రామం పెద్దమందడి మండలంలో, గద్వాల జిల్లాలో అలంపూర్, శాంతినగర్, ఐజా, కర్నూల్ జిల్లలో మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం మాధవరం, కర్ణాటకలో బళ్ళారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సిందనూర్ ఏరియాలలో పందుల దొంగతనం చేసినారు. నేరస్తులను పట్టుకున్న విధానం ఎస్పీ వనపర్తి డీఎస్పీ వనపర్తి పర్యవేక్షణలో ఆత్మకూరు సీఐ,శివకుమార్, అత్మకూరు ఎస్సై, నరేందర్, అమరచింత ఎస్సై,సురేష్, అధ్వర్యంలో వారి సిబ్బంది భీమయ్య, సత్యనారాయణ గౌడ్, పురుషోత్తం, క్రాంతి, మరియు టెక్నికల్ టీం గోవిందు, మురళి ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తేది. 11.03.2025 నాడు ఉదయం అందా 10:00 గంటల సమయలంలో మళ్ళీ సిద్దప్ప (ఎ 1) యొక్క బొలెరో తీసుకొని హోలిగుంది అంజి, సిరిగెరి నాగరాజు మరియు బింగిదొడ్డి అంజి అందరు కలుసుకొని దొంగతనం చేయడం కోసం అని అమరచింత వైపు వస్తుండగా మస్తీపూర్ దాటిన తరువాత చౌరస్తాలో పోలీస్ వారు వాహనాల తనిఖీ చేస్తుండగా వారిని గమనించి నేరస్తులు బొలెరో తిప్పుకొని పారిపోతుండగా పోలీసు వారు వారిని కొద్దిదూరం వెంబడించి పట్టుకొని ఇక్కడకు ఆత్మకూర్ సిఐ సార్ ఆఫీస్ దగ్గరకు పట్టుకొని వచ్చినారు. తరువాత పోలీస్ వారు అట్టి నేరస్తులను అందరిని వారి స్వాదీనంలోకి తీసుకొని విచారించగా నేరంను ఒప్పుకున్నారు.నిందితుల వివరాలు..ఎ -1) సిద్దు @ యెరుకలి సిద్దప్ప @ భజంత్రి తండ్రి దొడ్డ సిద్దప్ప, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: యెరుకలి, ఓసీసీ: పండ్ల వ్యాపారం మరియు పందుల మేత r/o ఇంద్రనగర్ కాలనీ, సిందనూరు గ్రామం మరియు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మండలం.ఎ -2) యెరుకలి అంజి @ ఆంజనేయులు తండ్రి లేట్ హన్మంతు, వయస్సు: 20 సంవత్సరాలు, కులం:ఎరుకలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆధోని మండలం హోలిగొండ గ్రామం. ఎ -3) యెరుకలి నాగరాజు తండ్రి లేట్ దుర్గప్ప, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: యెరుకలి, ఓసీసీ: మేసన్ r/o కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లా, సిరిగుప్ప మండలం సిరియేరి గ్రామం.ఎ -4) యెరుకలి అంజి @ ఆంజనేయులు @ బింగిదొడ్డి అంజి తండ్రి యెరుకలి నర్సిములు, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: యెరుకలి, ఓసీసీ: కూలీ మరియు పందుల వ్యాపారం r/o జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామం, ఎ 5. యెరుకల్ భీమన్న @ భీమా @ భీముడు తండ్రి వీరేష్, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: యెరుకలి, Occ: సిల్వర్ గూడ్స్ వ్యాపారం, R/o యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా ఎ 6. గుల్లి నాగరాజు @ యార్కల నాగరాజు తండ్రి వై. మద్దిలేటి, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ఏరుకల, ఓసీసీ: ప్రైవేట్ ఉద్యోగం R/o ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో, యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా. ఎ 7. యమ్మిగనూరు మండలం కందనతి గ్రామం కందెనాథ్ సుంకన్న R/o. (పరారీలో ఉన్నారు) ఎ 8. మదిరె మహేష్ R/o మదిరె గ్రామం కౌతాళం మండలం, కర్నూలు జిల్లా. (పరారీలో ఉన్నారు). ఎ 9. నందవరం బాలరాజు @ యెరుకుల బాల రాజు తండ్రి Y. యల్లప్ప, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: యెరుకలి, ఓసీసీ: సిల్వర్ గూడ్స్ వ్యాపారం & పందుల పెంపకం R/o నందవరం గ్రామం మరియు మండలం. కర్నూలు జిల్లా.ఎ 10. గోనెగండ్ల సతీష్ @ యెరుకలి సతీష్ తండ్రి. రంగముని, వయస్సు: 19 సంవత్సరాలు, కులం: యెరుకలి, ఓసీసీ: కూలీ మరియు పందుల పెంపకం R/o గోనెగండ్ల గ్రామం మరియు మండలం, కర్నూలు జిల్లా.నిందితుల నుండి స్వాధీన పరచుకున్న డబ్బులు, వస్తువుల వివరములు.01-బొలెరో వాహనం, 90వేల రూపాయలు,3 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం లో ఉన్నాయి. ఈ పత్రిక మీడియా సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డీఎస్పీ, అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు,ఆత్మకూరు సీఐ, శివకుమార్, ఆత్మకూరు ఎస్సై,నరేందర్ , అమరచింత ఎస్సై, సురేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News