- నిందితులను కఠినంగా శిక్షించాలి
- టిఎస్ఎస్ఓ రాష్ట్రఅధ్యక్షులు లక్ష్మీనివాస్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లిపరామర్శించిన టిఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ రఘు ముదిరాజ్ సుధాకర్ సంపత్ రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని లక్ష్మీ నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని లక్ష్మీ నివాస్ స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుడినేఅవమానించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని లక్ష్మీ నివాస్ డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





