Wednesday, March 25, 2026

మైనర్ బాలికపై అత్యాచారయత్నం

  • నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు
  • అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్

నేటి సాక్షి, కోదాడ (అనంతగిరి): ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి (40) శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఇంటి పక్కన మహిళలు పరిగెత్తుకుని రావడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి సదరు బాలిక సోదరి పిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News