- వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం
- నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
- వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు

నేటి సాక్షి ప్రతినిది వనపర్తి జిల్లా : అధికారులు ప్రజా ఉపయోగపరమైన పనులపై దృష్టి సారించి పనుల్లో వేగవంతం పెంచాలని, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లవేళల సహకరిస్తానని, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి కష్టపడే తత్వం గల వ్యక్తి ఉన్నాడని ఆయన ప్రతిపాదించిన ప్రతి పనిని తాము ఆమోదించి మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.శనివారం వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రా నిర్మాణానికి, వ్యవసాయ శాఖ మంత్రితోపాటు టూరిజం శాఖ మాత్యులుజూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి తో కలిసి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారూ.అనంతరం వెల్టూరు గ్రామ చేనేత కాలనీలోని ఉన్ని పారిశ్రామిక సంఘం ను వారు సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడారు, ఇక్కడ కార్మికులు తయారుచేసిన రగ్గులకు ఫినిషింగ్ కోసం హర్యానా వెళ్ళవలసి వస్తుందని ఆ ఫినిషింగ్ యూనిట్ను తమకు మంజూరు చేయవలసిందిగా శాసనసభ్యులు మేఘారెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.అందుకు ఆయన సానుకులంగా స్పందించారు. ఉన్ని చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పనికి తగ్గ వేతనం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిని మంత్రి ఆదేశించారూ. అనంతరం జాతీయ రహదారి బుర్రవాగు స్టేజి నుంచి మోజర్ల గ్రామానికి వెళ్లే రహదారిలో నిర్మించే బ్రిడ్జిల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.పెద్దమందడి మండలంలో నిర్మించే 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





