- సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం
నేటి సాక్షి, జమ్మికుంట : పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అంతేకాకుండా వీళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు డిపో మేనేజర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద చల్లటి మంచినీరు అందించాలి. అవసరమైతే మజ్జిగను అందజేయాలి మరియు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు బిగించాలి. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద సెంటర్లు నిలుపాలి అని అన్నారు. పై విషయంపై సక్రమమైన వసతులు లేని పాఠశాలలపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని సెంటర్లను మూసివేయాలని హెచ్చరించారు.





