Monday, March 30, 2026

ఆటోమేటిక్ సౌండ్ సిస్టమ్ అందజేత

నేటిసాక్షి(కె. గంగాధర్ )పెగడపల్లి : పెగడపల్లి మండలంలోని బతికేపల్లి గ్రామం లో ప్రసిద్ధి చెందిన మార్కండేయ ఆలయానికి వెల్మల్ గ్రామ వాస్తవ్యులు కముటం మల్లయ్య మల్లవ్వ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు, సత్యవతి టైం బేస్డ్ ఆటోమేటిక్ మైక్ సిస్టం ను అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ మార్కండేయ స్వామీ కరుణ కటాక్షాలు ఉండాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామస్థుల తరుపున తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఆలయ అర్చకులు, పద్మశాలి సంగం ప్రెసిడెంట్ వెంకట రమణ పద్మశాలి పెద్దలు, కంటం మల్లయ్య రిటైర్డ్ (ఏ ఎస్ ఐ)నల్ల రాజన్న, నల్ల మహేష్ ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News