Tuesday, March 31, 2026

అవిలాల పంచాయతీ నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి

  • కార్యదర్శికి వినతి పత్రం సమర్పించిన పంచాయతీ వైఎస్సార్ సిపి కార్యవర్గం

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి రూరల్ అవిలాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా, వేసవి కాలంలో త్రాగునీటి రక్షిత మంచినీరు సరఫరా విధానంతో పాటు ప్రతి ఇంట్లో త్రాగునీరు అందించాలని అవిలాల వైఎస్సార్ సిపి కార్యవర్గ సభ్యులు శివ శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ ప్రజల తరఫున నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుని నీటి సమస్యను సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, సుబ్బయ్య కాలనీ, వినాయక నగర్, వాణి నగర్ తదితర ప్రాంతాల్లో నీటిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని అవిలాల పంచాయతీ వైఎస్సార్ సిపి కార్యవర్గ సభ్యులు శివ కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News