నేటి సాక్షి, వేమనపల్లి : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ అన్నారు. మంగళవారం ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్‌తో కలిసి విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యసనం ఒక ప్రాణాంతక వ్యాది అని, వ్యసనపరులు దీర్ఘకాలం పాటు దానికి బానిసై తమ ఉనికిని కోల్పోతున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడే యువత శారీరక రుగ్మతలకులోనై, జ్ఞాపకశక్తి కోల్పోయి, విచక్షణ, విజ్ఞత కోల్పోయి నేరాలకు పాల్పడుతూ దురదృష్టవశాత్తు కేసుల్లో నిందితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలు వినియోగించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని, 20 ఏండ్ల వరకు కఠిన కారాగార శిక్షలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

– గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు
స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, హాస్పిటల్స్‌కు వంద మీటర్ల రేడియస్‌లో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మితే సెక్షన్ 6 ఆఫ్ కోప్ట ఆక్ట్,సెక్షన్ 77,78 జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం నేరం అని ఎస్సై చెప్పారు. ఆశ్రమ పాఠశాలకు 20 మీటర్ల దూరంలో ఉన్న లింగేష్ మెకానిక్ షాప్‌లో తనిఖీ చేయగా, అంబర్ ప్యాకెట్స్, విమల్, బీడీ, సిగరెట్లను లభ్యం కాగా, వాటిని సీజ్ చేశారు. షాపుల్లో ఎవరైనా నిషేధిత గుట్కా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

