Monday, March 23, 2026

తడి పొడి చెత్తపై అవగాహనా

నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని పదవ వార్డ్ లోని ప్రజలకు సోమవారం తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త పై కమిషనర్ మోహన్ అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని,ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారుచేసి పట్టణంలోని మొక్కలకు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని అన్నారు. పారిశుధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము అని అన్నారు. పురపాలిక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ 2024 సర్వే ప్రారంభమైంది, ప్రజలందరూ మెట్ పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్ బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్ ఉపయోగించి అభిప్రాయము తెలియజేయలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు,ముజీబ్, నిజాం, అశోక్, నర్సయ్య పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News