Wednesday, March 25, 2026

వ్యర్ధాల నిర్వహణపై అధికారులకు అవగాహన

  • కోరుట్ల పట్టణాన్ని సందర్శించిన 7 మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు, అధికారులు

నేటి సాక్షి, కోరుట్ల ( రాధారపు నర్సయ్య ) : కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికె. శ్రీదేవి ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీలో ఘన వ్యర్ధాల నిర్వహణ కు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంపోస్టింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హేమలత కంపోస్టిక్ సంబంధించిన నిర్వహణ ఏ విధంగా చేపట్టాలి దానికి సంబంధించిన సలహాలు సూచనలను అవగాహన కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీ నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులకు అందించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కంపోస్టింగ్ విధానం కోరుట్లలో ఏ విధంగా జరుగుతుంది స్వయంగా తెలుసుకోవడమే కాకుండా డిఆర్సిసి ని కూడా సందర్శించారు. అంతేకాకుండా డీఆర్సీసీ నందు ఏ విధంగా రీసైక్లింగ్ పంపుతున్నారు. అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మరియు అవగాహన కార్యక్రమానికి హాజరైన వివిధ మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు మరియు డిఈలు, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News