నేటి సాక్షి, రామడుగు, (పురాణం సంపత్) : రామడుగు మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సైబర్ నేరాల పై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజయ్య మాట్లాడుతూ మీ మొబైల్ ఫోన్లలో గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా వాట్సప్ గ్రూపులలో లింకులు పంపించి ఓటీపీలు చెప్పండి అని అంటూ ఫోన్ చేసిన వారిని నమ్మవద్దని అన్నారు. ఓటిపి చెబితే వెంటనే మీ ఖాతాలోని డబ్బులు సైబర్ నేరగాళ్లు కొట్టేస్తారని అన్నారు. మీకు ఎవరైనా తెలియని వారు ఫోన్ చేస్తే 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజయ్య పోలీసులు పాల్గొన్నారు.





