

నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ర్యాంక్ ప్రజల అభిప్రాయము, స్వచ్ఛత లింకు ద్వారా తెలుసుకోవటానికి వార్డు ఆఫీసర్లకు మున్సిపల్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ ప్రజలు చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. పారిశుధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము.పురపాలిక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ 2024 సర్వే ప్రారంభమైంది. ప్రజలందరూ మెట్ పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్ బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్ ఉపయోగించి అభిప్రాయము తెలియజేయలని కోరారు.19వ వార్డులో తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగిందని తెలిపినారు.ఈ కార్యక్రమం లో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.





