Tuesday, March 24, 2026

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మునగాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు, సైబర్ నేరాల పైన గంజాయి, డ్రగ్స్ మత్తు మందుల పై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఏ ఎస్ ఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి,డ్రగ్స్ ,మత్తు మందులు,గుట్కా పై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని తెలిపారు. సైబర్ మోసాల పై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని. అతివేగం ప్రయాణించ వద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డి పి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చే అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు . డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు. అనంతరం పోలీసు కళబృందం చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమం లో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బూర సైదయ్య గౌడ్, పోలీస్ సిబ్బంది శివ కోటేశ్వరరావు, జ్యోతి, కళాబృందం ఇంచార్జి యల్లయ్య,గోపయ్య, గురు లింగం , కృష్ణ, చారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News