నేటి సాక్షి, మంథని (పెయ్యల రమేష్) : క్షయ రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దేశంలో 324 జిల్లాల్లో నిర్వహిస్తుందని అందులో పెద్దపెల్లి జిల్లా ఉందని దానిని మంథని ప్రజలు ఉపయోగించుకోవాలని మంథని టిబి సీనియర్ చికిత్స పర్యవేక్షకులు పోగుల వరలక్ష్మి తెలిపారు. మంథని డివిజన్లోని గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రచ్చపల్లి గ్రామంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గొప్ప పథకం నిక్షయ్ శిబిర్100 రోజుల పథకంలో భాగంగా క్షయ శిబిరాన్ని నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులలో స్క్రీనింగ్ పరీక్షలు, లక్షణాలున్నటువంటి వారి నుండి కఫాన్ని సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పోశం ఎం,ఎల్,హెచ్, పి. అనూష ఏ,ఎన్,ఎం. జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ స్వామి, ఆశా సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.




