నేటి సాక్షి, బెజ్జంకి: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వాహనదారులకు,యువకులు, గ్రామ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని చెప్పారు. వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.రోడ్డు భద్రతకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.





