- హాజరైన ఆర్టికల్చర్ కెన్ బయోసైన్స్ ప్రతినిధులు
నేటిసాక్షి/మంగపేట : మండల కేంద్రంలోని రైతువేదికలో హార్టికల్చర్ మరియు కెన్ బయోసైన్స్ కంపెనీ ప్రతినిధులచే మండలంలోని పామాయిల్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హార్టికల్చర్ అధికారి కొప్పిరి లావణ్య హాజరువగా మండలంలోని పామాయిల్ రైతులు అధిక సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు ఆర్థికల్చర్ అధికారి లావణ్య మాట్లాడుతూ రైతులు మొక్కకి కావలసిన పోషకాలు అందించడంతోపాటు సరిపడినంత నీరు అందించాలన్నారు.మంగపేట లో రైతులు పామ్ ఆయిల్ సాగు వైపు అడుగులేయడం అభినందనీయమని అధిక శ్రమ, అధిక పెట్టుబడి, ఎక్కువ మంది లేబర్ తో పనిలేని క్రాప్ పామాయిల్ అన్నారు.ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నందున నియోగపర్చుకొవలన్నారు. కంపెనీ ప్రతినిధి ఏరియా ఇంచార్జి శివకృష్ణ మాట్లాడుతూ వస్తున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగులో పాటించవలసిన మెలకువలను తెలిపారు. మూడు సంవత్సరాలు నిండిన తోటలో వివల్స్ వదలాల్సి ఉండగా ఉష్ణోగ్రత అధికంగా ఉన్నందున జూన్ నాటికి సమయం పొడిగించడం జరుగుతుందని రైతులకు వివరించారు. అనంతరం మండలంలోని కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. భవిష్యత్తులో ఎక్కువ ప్లాంటేషన్ జరిగితే మరిన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కూడా అవకాశం ఉందన్నారు.రైతులు పండించిన పామాయిల్ గెలలను ఒక్కటి కూడా వదలకుండా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు కె ఎన్ బయోసైన్స్ ధ్వారా తామే కొనుగోలు చేస్తామని రైతులకు భరోసాని ఇచ్చారు. రైతులు పండించిన పంటను కేవలం కొనుగోలు కేంద్రం వరకు తరలిస్తే సరిపోతుందన్నారు. త్వరలో ములుగు జిల్లాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందన్నారు. ఆయిల్ ఫామ్ రైతుకు మంచి లాభదాయకమైన పంటని మరింత మంది రైతులు ఈ దిశగా పయణించాలని కోరారు. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన గెలలను తొలగించడం ధ్వారా మొక్క ఎదుగుదల ఉంటుందన్నారు అనంతరం వచ్చే గెలలో ఆయిల్ శాతం ఉంటుందని ముందస్తు గెలలను తొలగించి రైతులు పంట దిగుబడిని అధికంచేసుకునేలా ఆలోచించాలన్నారు కొందరు రైతులు తమ అనుమానాలపై సమాధానం రావడంతో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పలు ప్రశ్నలకు సమాధానం లభించిందని సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమం లో కంపెనీ ప్రతినిధులు సాంబశివరావు,అఖిల్, వ్యవసాయ విస్తరణ అధికారి గాయత్రి రైతులు పాల్గొన్నారు.





