Thursday, March 12, 2026

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు

  • రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
  • రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్

నేటి సాక్షి, పెద్దపల్లి(వోడ్నాల తిరుపతి) : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాల లలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ… ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా, రోడ్డు నియమాలు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు. వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, అతివేగం, మొబైల్‌ ఉపయోగిస్తూ డ్రైవింగ్‌, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించుట హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంబవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సహదేవ్ సింగ్, ప్రిన్సిపాల్ రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News