నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు గురువారం రోజున విద్యార్థిని విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, భవన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ హన్మకొండ నిర్వాహకులు జి.దామోదర్ ఆంగ్లము లో గల సందేహాలను సులభమైన పద్దతిలో బోధించారు. వార్షిక పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, తరచుగా ఇంగ్లీష్ సబ్జెక్టు లో చేసే తప్పులను విద్యార్థులకు తెలుపుతూ, ఏవిధముగా చదివితే గరిష్ట మార్కులు సాధించగలమో సులభ పద్ధతిలో వివరించారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు, ఇంగ్లీష్ అధ్యాపకురాలు ఆర్. రజిత, ఇతర అధ్యాపకులు సుగుణ, తులసీ దాసు, జ్యోతి, శైలజ, రేణుకా, సాయిచరణ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.