Monday, December 23, 2024

గురుకులంలో ఘోరం

  • ఒకే గదిలో పడుకున్న ముగ్గురు విద్యార్థులకు పాముకాటు
  • ఒకరు మృతి.. ఇద్దరిని నిజామాబాద్ తరలింపు
  • అర్ధరాత్రి వరకు ఆర్డీవో విచారణ
  • ఫోన్ చేస్తే స్పందించని ప్రిన్సిపాల్
  • అసలు పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది

నేటి సాక్షి, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్​​పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముగ్గురు వి ద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు మార్గమధ్యంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితి లో నుంచి బయటపడ్డారని ఆసుపత్రి వైద్యు లు చెబుతున్నారు.
అసలేం జరిగింది?
తొలుత గుణాధిత్య అనే విద్యార్థి తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయారని పోలీసులు పేర్కొంటున్నారు. వంశపారంప ర్యంగా ఫిట్స్ వ్యాధి ఉండడంవల్ల ఆ విద్యార్థికి వచ్చిందని పోలీసులు తమ విచారణలో తేలిందని చెప్పారు. అది ఫిట్స్ కాదు.. తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు రోదిస్తూ చెప్పారు.
అర్ధరాత్రి ఆర్డీవో విచారణపై అనుమానాలు?
పొద్దునెప్పుడో గుణాధిత్య అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన కలకలం రేగగా.. రాత్రిపూట మెట్ పల్లి ఆర్డీవో నక్క శ్రీనివాస్ పెద్దాపూర్ గురుకులంలో అడుగుపెట్టడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత కూ మరి గురుకులంలో ఏం జరుగుతోంద న్నదానిపై ‘నేటి సాక్షి’ ఆరా తీయగా.. ఆస క్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చీమలు కుట్టాయని ఆర్డీవోకు రిపోర్ట్
గురుకుల విద్యార్థులకు అడవి చీమలు కు ట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. పాము కుట్టలేదని గురుకులంలో ఉండే హె ల్త్ సిబ్బంది ఆర్డీవో నక్క శ్రీనివాస్​కు నివే దించినట్టు సమాచారం. ఆహా.. చీమలు కుడితే ఒకరు.. చనిపోతారు.. మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటారా? అని ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఫోనెత్తని గురుకుల ప్రిన్సిపాల్
ముగ్గురు విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు అన్న సమాచారం తెలుసుకునేందుకు ‘నేటి సాక్షి’ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్ ను ఫోన్ లో సంప్రదించింది.ఆయన 20 సార్లకు పైగా ఫోన్ చేసినా స్పందించలేదు.
ఏబీవీపీ తోడుగా..
పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థి మృతి చెందాడని తెలిసిన వెంటనే ఏబీవీపీ అప్రమత్తమైంది.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని.సునీల్ తన తోటి మిత్రులతో ఇటు గురుకులంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడంతో పాటు నిజామాబాద్ ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులకు సేవలందించేందుకు నిజామాబాద్ ఏబీవీపీ శాఖను అప్రమత్తం చేశారు.

ఒక్కరికి కాదు.. ముగ్గురి పాము కాటుగుణాధిత్య అనే విద్యార్థి మృతిపై తల్లిదం డ్రులకున్న అనుమానం నిజమైంది. ఆ వి ద్యార్థితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే గదిలో నిద్రపోయారని.. వీరు ముగ్గురుని పాము కాటు వేసిందంటున్నారు. వీరందరినీ సమీప మెట్​పల్లి.. కోరుట్ల.. జగిత్యాల.. పట్టణాలు కాకుండా నిజామా బాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మార్గమధ్యంలోనే గుణాధిత్య మృతి చెందాడని.. అతను ఫిట్స్​తో చనిపోయాడ ని గురుకుల సిబ్బంది చేతులుదులుపుకు న్నారు. ఇక మిగిలిన విద్యార్థుల్లో ఒకరు ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండా పూర్​కు చెందిన ఆడెపు గణేష్ అనే విద్యా ర్థిని నిజామాబాద్ శ్రీకృష్ణ హాస్పిటల్​లో చికిత్స చేయిస్తున్నారు. అదేవిధంగా.. మరో విద్యార్థిది మెట్​పల్లి పట్టణం.. రాపర్తి హర్ష వర్ధన్.. ఇతన్ని కూడా నిజామాబాద్ లోనే మరో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికి త్స అందిస్తున్నారు.ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారని వైద్యులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News