Tuesday, March 10, 2026

రాజనగర్ కేంద్రంగా వెదురు దందా…పట్టించుకొని అధికారులు

నేటిసాక్షి, రాయికల్:
రాయికల్ మండలం రాజనగరం కేంద్రంగా వెదురును అక్రమంగా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. ఆలూర్, రాజనగరం అటవీ ప్రాంతం నుండి వెదురును అక్రమంగా నరికి రాజనగర్ సమీపంలోని అటవీప్రాంతంలో నిల్వ చేసుకొని రాత్రి వేళల్లో ఇతర గ్రామాలకు తరలిస్తూ స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రాయికల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అడవుల్లో వెదురు, టేకు కలప ఉండగా స్మగ్లర్ల కన్ను ఈ ప్రాంతాలపై పడింది. దాంతో అధికారులను మచ్చిక చేసుకొని కొందరు అక్రమార్కులు వెదురును అక్రమంగా నరికి నిల్వ చేసుకొని రాత్రి వేళల్లో తరలిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వెదురు అక్రమ తరలింపుపై అధికారులకు సమాచారమిచ్చిన పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News