Tuesday, March 17, 2026

బహిరంగ ప్రదేశాలలో మద్యపానంపై నిషేధం కొనసాగింపు

  • అనుమతి లేని డ్రోన్ డిజె సౌండ్స్ పై సైతం
  • కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
  • రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ (ఐజి) శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడం తోపాటు ప్రజల భద్రత, రక్షణ కోసం నిషేధాజ్ఞలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 01,2025 నుండి మార్చి 01,2025 వరకు కొనసాగుతాయన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం సైతం ఉందని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం,1348 ఫసలీ నిబంధనలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.అదేవిధంగా డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలను సైతం పొడగింపు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించామన్నారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని, అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే, సంబంధిత డివిజన్ ఏసిపి ల నుండి అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లో వినియోగించాలో నిబంధనలు ఉన్నాయన్నారు. ఈ నిషేధాజ్ఞలు సైతం ఫిబ్రవరి 01,2025 నుండి మార్చి 01,2025 వరకు కొనసాగుతాయన్నారు.పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం సైతం ఉందని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం,1348 ఫసలీ నిబంధనలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి మంచిర్యాల జోన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ 7(1), 2016 యాక్ట్, 22(1)(ఏ) నుండి 22(2)(ఏ)(బి), 22(3) సుటి పోలీస్ యాక్ట్, 1348 నెంబర్ 9 ఫసలీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఫిబ్రవరి 01, 2025 ఉదయం 6 గంటల నుండి మార్చి 01, 2025 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ సెక్షన్లో ప్రకారం రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. అటువంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీసు అధికారులను అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సూచించారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ, బలవంతంగా వివిధ సంస్థలు మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రత పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News