నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదినం సందర్బంగా టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు బందెల రాజ భద్రయ్య ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో రాజ భద్రయ్య ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించి, మెమెంటో బహుకరించారు.ఈ సందర్బంగా రాజ భద్రయ్య మాట్లాడుతూ జనం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉసిల్ల నర్సింగరావు, బొడ్డు ప్రసాద్, శివాజీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




