Monday, December 23, 2024

Bandi’s open letter to CM : సీఎంకు బండి బహిరంగ లేఖ

నేటి సాక్షి, కరీంనగర్​: సీఎం రేవంత్​రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఉద్యోగుల కామన్ టైమ్ టేబుల్‌లో మార్పులు చేయాలని, కరీంనగర్ జిల్లాలోని పోలీసుల టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. అందులో పలు విషయాలు ప్రస్తావించారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పనివేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు.

ఉదయం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంతో నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదని చెప్పారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమని బండి సంజయ్​ పేర్కొన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో డిమాండ్​ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News