- బీసీలకు స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తాం
- బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇప్పకాయల సాగర్ ను, రాష్ట్ర కార్యదర్శిగా కాట్రపల్లి గ్రామానికి చెందిన రావుల రాజేష్ లను నియమిస్తూ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సంఘటితం కోసం, హక్కుల సాధన కోసం అలుపు లేని పోరాటం చేస్తామని, జనాభాలో సగభాగమైన బీసీలం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని, వారిని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధన కోసం ఉద్యమాలు చేస్తామని అన్నారు. బీసీలు అందరం ఏకమై తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించు కోవాలని,మహనీయుల స్ఫూర్తితో పోరాటాలు చేయాలని బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నియమకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్ మాట్లాడుతూ బీసీల ఉద్యమంలో చురుగ్గా ఉంటామని జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తామని, రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన బీసీల పోరాటాన్ని ముమ్మరం చేస్తామని అన్నారు. నియమాకానికి సహకరించిన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్ప కాయల సాగర్, రాష్ట్ర కార్యదర్శి సంపత్, హుజురాబాద్ మండల అధ్యక్షులు పెరమండ్ల కోటేశ్వర్, భాస్కర్,వేముల రమేష్, తాడూరి మల్లేష్ లు తదితరులు పాల్గొన్నారు.

