జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు — పొనుగోటి రంగా..
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్)
కుల జన గణన స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుంటి సాకులు చెబుతూ బీసీ సమాజ దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడలు వేస్తుంది అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ. పార్లమెంటు సాక్షిగా కుల జనగణన చేయాలని రాహుల్ గాంధీ కోరడం ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రధాన అంశంగా కుల జన గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ పెంచుతామన్న హామీ విస్మరించటం కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద నీతికి తార్పానం అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఢిల్లీలో ఒకలాగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరోలాగా డ్రామాలు ఆడటం ఆ పార్టీ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు. ఈ ద్వంద నీతి ప్రదర్శన అధికారం కోసం వేసే ఎత్తుగడలు తప్ప బీసీ సమాజానికి మేలు చేయటం కోసం కాదని ధ్వజమెత్తారు. బిసి సమాజం కాంగ్రెస్ పార్టీ మోసాలను గ్రహించిందని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఉన్నారు. 60 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి భూస్వాములకు కొమ్ము కాసిందని నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ము కాయడం చూస్తుంటే కుక్క తోక వంకర అన్న చందంగానే రెడ్డి బుద్ధిని మార్చుకో లేదని అన్నారు. ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్క కులానికే ప్రాధాన్యత ఇవ్వడం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని విస్మరించటం ముఖ్యంగా బీసీలను అవమాన పరచటం పదవుల పంపకాలలో బీసీలను అవహేళన చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క డీఎన్ఏ లోనే ఆ స్వభావం ఉంది అనేది బలహీన వర్గాల ప్రజలు, బీసీ సమాజం చర్చించు కుంటుందని తెలిపారు. ఎన్నికల ముందు ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత కామారెడ్డి బిసి డిక్లరేషన్ తుంగలో తొక్కుటకు కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తుందని అన్నారు. కుల జన గణన వ్యతిరేకులైన రెడ్ల ను రాజ్యాధికారంలో కూర్చో పెట్టి కుల జన గణన చేస్తామనడం హాస్యస్పదమని తెలిపారు. బీసీల రాజకీయ వాటాలను రెడ్ల భూస్వాములకు దోసి పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లకు పైగా ఉన్న పార్టీల కంటే ముందు వరుసలో ఉంటుందని ఉన్నారు. రెడ్లకు పెద్ద పీఠం వేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని భ్రమలో ఉన్నట్టు తెలుస్తుందని అన్నారు. రెడ్ల ఓట్లతో మాత్రమే రాజ్యాధికరంలోకి వచ్చాము అన్నట్లు భ్రమలో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే కీచక మోసం నిక్షితంగా గమనిస్తున్న బీసీ సమాజం లోలోపల రగిలి పోతుందని తెలిపారు. బీసీల రాజకీయ చైతన్యం నీవూరు గప్పిన నిప్పులా ఉందని స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తుందని ప్రతి పల్లెలలోని బీసీ నాయకులు బీసీ కులాలను ఏకం చేసి ఓటు చైతన్యముతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని తెలిపారు.





