- రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం కొండ దేవయ్య.. అధ్యక్షులు
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం పక్షాన తమ వంతు కృషి చేస్తామని,మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. శుక్రవారం వేములవాడ బీసీ సాధికారిత సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి అనాయ మాట్లాడుతూ… మహిళా జనాభా ప్రాతిపదికపై ,మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులను కేటాయించాలని అన్నారు. ప్రస్తుతం రిసోర్స్ పర్సన్స్ గా పనిచేస్తున్న మహిళల ద్వార,వారి సహకారంతో ,రాష్ట్రం లోని మహిళలను చైతన్య పరుస్తూ,రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టుచున్న సంక్షేమ పథకాలను వినియోగించుకునే లాగ అవగాహన కల్పించుటకు , రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం పక్షాన గ్రామ,మండల, జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని కొండ దేవయ్య తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళ సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ,వాటి ప్రచారం వాటిపైన సరియైన అవగాహన లేకుండడం వలన ,మహిళల కొరకు చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో వినియోగం జరుగడం లేదని, అందుకుగాను బీసీ సాధికారిత సంఘం పక్షాన అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. గతంలో కులవృత్తులపైన ఆధారపడి దర్జాగా, అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల జీవనాన్ని సాగించారని రోజు రోజుకు కులవృత్తులు అంతరించిపోతుండడంతో పురుషులతో పాటుగా మహిళలకు కూడ ఉపాధి కరువైందని మహిళలను చైతన్య పరుస్తూ వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నదనీ రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాజినేని రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం అధికార ప్రతినిధి మైలారం రాముతో పాటు తదితరులు పాల్గొన్నారు.





