నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ రచన అయినటువంటి విజయ తెలంగాణ తెలుగు మరియు ఆంగ్ల గ్రంథ ఆవిష్కరణ హైదరాబాదులోని జలవిహార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకుడు గౌనికాడి యాదయ్య. ఆయన మాట్లాడుతూ.. దేవేందర్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన నాయకుడిగా ఎదిగి ఎనలేని సేవలు చేశారని, హైదరాబాద్ నడిబొడ్డున బీసీ నాయకులకు ఒక వేదిక ఉండాలని బీసీ సాధికారత భవన్ ని ఏర్పాటుచేసి బిసి నాయకులకు అండగా నిలుస్తున్నరాని, నేటి యువతరానికి ఆయన ఒక ఆదర్శ నాయకుడని, అభిమానాన్ని చాటేందుకు విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణకు హాజరైనట్లు తెలిపారు.





