నేటి సాక్షి, మందమర్రి:- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి సంఘం నాయకులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే సమాజంలో అసమతల మీద అలుపెరగని పోరాటం చేశారని, మహిళ హక్కుల కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.



