నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం సూచన మేరకు చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కోశాధికారిగా నియమిస్తూ. నియామక పత్రాన్ని అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం మాట్లాడుతూ నూటికి 60 శాతం ఉన్న బీసీకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక ఎన్నికల్లో 27 శాతం ఉన్న రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్, ఉపాధ్యక్షులు హనుమయ్య చారి,ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, అధికార ప్రతినిధి కటకం మల్లేశం,తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.




