నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం సూచన మేరకు రుద్రంగి మండల అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని నియమిస్తూ రుద్రంగి మండల ప్రధాన కార్యదర్శిగా పిలమరపు ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులుగా సుడిగాపు పరుశురాం, మండల కోశాధికారిగా లంక దాసరి శ్రీనివాస్, మండల కార్యదర్శిగా లింగంపల్లి జయంత్ కుమార్, కాసోజు విటల్, కార్యవర్గ సభ్యులుగా మరుపల్లి రవి, ఉప్పులూటి రవి,బొమ్మన స్వామి, గట్ల రాజు లను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం మాట్లాడుతూ.. నూటికి 60 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక ఎన్నికల్లో 27 శాతం ఉన్న రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, చందుర్తి మండల అధ్యక్షులు కొమరబండ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ బీసీ నాయకులు పాల్గొన్నారు.




