Thursday, March 12, 2026

ఆన్‌లైన్ సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

  • యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. తిరుమలేష్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఆన్‍లైన్ సైబర్ మోసాల పట్ల యువత,ప్రజలు అప్రమత్తం ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లా తో పాటు వివిధ ప్రాంతాలలో పలు ఆన్‌లైన్ యాప్ లో పెట్టుబడి పెడితే రోజు వారిగా అత్యధిక డబ్బు వస్తుందనే ప్రచారంతో చాలామంది చదువుకున్న యువత, ఉద్యోగులు, సామాన్యులు లక్షలాది రూపాయలు పెట్టి మోసపోతున్నారని, ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ వంటి చెడు ప్రభావాలకు అలవాట్లను విడిచి మంచి నడవడిక లతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు. ఆన్‌లైన్ పెట్టుబడి పెట్టిన తర్వాత యాప్ లు పని చేయడం లేదని మోసపోయామని గ్రహించి ఎటు చెప్పుకో లేక పిర్యాదు చేయలేక లోలోపల కృంగి పోతున్నారని, సైబర్ క్రైమ్ 1930 కి ఫోన్ చేయడం అఫిషియల్ నెట్ సైట్ లో లేదా స్థానిక పోలీసు స్టేషన్ లలో నిర్భయంగా పిర్యాదు చేయాలన్నారు. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబంలో రూపాయి రుపాయి ఖర్చు చేయకుండా కూడ బెట్టుకొని ఇలా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి పెట్టుబడి పెట్టాక మోసపోయామని గ్రహించి కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న మరణ వార్తలు ఎన్నో చూస్తున్నాం. కావున కుటుంబ పెద్దలు తమ పిల్లలు చేస్తున్నటువంటి కార్యకలాపాలపై నిఘా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలేష్ కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News