- మోసగాళ్ల వలలో పడోద్దు 1930 కి ఫిర్యాదు చేయండి
- సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జమ్మికుంట పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ…గ్రూపుల్లో వచ్చే పిడిఎఫ్ లింకులను ఓపెన్ చేయవద్దని అలా ఓపెన్ చేస్తే అకౌంట్ లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు తమ అకౌంట్లో నుండి వేల రూపాయలు దండుకుంటున్నారని ఈ మధ్యకాలంలో సైబర్ నెరగాళ్ళు బారిన చాలామంది పడుతున్నారని వారి అకౌంట్లో నుండి లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఒకవేళ మీరు గనుక సైబర్ నెరగాళ్ల వలలో పడి మీ అకౌంట్ లో నుంచి డబ్బులు పోయి మోసపోతే 24 గంటల్లోపు 1930 నెంబర్ కి కాల్ చేసి వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకోవాలని, అలా ఫిర్యాదు చేసిన వెంటనే సైబర్ నేరగాలైన వారి అకౌంట్ ఫ్రీజ్ చేయబడుతుందని, మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందవచ్చని వారన్నారు. చాలామంది యువత ఈ మధ్యకాలంలో జమ్మికుంట మరియు పరిసర ప్రాంతాల వారు 1930 గురించి తెలియక డబ్బులు పోగొట్టుకున్నాక తమ కుటుంబానికి ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారని అలా చాలామంది చనిపోయిన సందర్భాలు కనబడ్డాయని ఇకమీదట అలాంటి పొరపాట్లు జరగకుండా 1930 పై అవగాహన కల్పించడానికి ఇలా కార్యక్రమాలు చేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.





