Friday, March 20, 2026

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : హైడ్ క్రాఫ్ట్ ఏదైతే చేతివృత్తుల వారి నైపుణ్య అయినా హ్యాండ్ క్రాఫ్ట్ హైదరాబాద్ మరియు వనపర్తి జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులకు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం గురువారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుడిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల స్వర్ణకారుల ప్రభుత్వంగా ఉండాలని ఎస్పీ అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఫోన్ కాల్స్, వాట్సాప్, లింకులు పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత సమాచారం తో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు అన్నారు వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం నష్టాలు కలిగించడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు అంతేకాక రోజువారి వాడే మొబైల్స్ లో ల్యాప్టాప్ల ద్వారా మన డేటాని హ్యాక్ చేసి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండటానికి డైజేషన్ ఫౌండేషన్, గూగుల్ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బ్రహ్మచారి, వనిత జ్యోతి, అధ్యక్షురాలు ఏకే ఖమర్, రహమాన్స్వర్ణకార సంఘాల ప్రతినిధులు మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News