- మెట్ పల్లి డీఎస్పీ రాములు
నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి డిఎస్పీ రాములు అన్నారు. సోమవారం పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు హాజరై విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఫోన్ లో ఎవరైనా అనుమానితులు ఫోన్ చేసినా, వాట్సాప్ లో మెసేజ్ లు వచ్చిన వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు. బ్యాంకు లావాదేవీలపై సైబర్ నేరగాళ్లు ఫోన్ సందేశాలు, వాట్స్అప్ కాల్స్ వచ్చిన మీకు లక్షల కొద్ది రుణం మంజురైందని ఫోన్ కాల్స్ వచ్చిన నమ్మొద్దని, ఏమైనా అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ లకు ఫోన్ చేయాలని అన్నారు. ఫోన్ లో ఫోటో మార్ఫింగ్ చేసి భయపెట్టే ప్రయత్నాలు చేస్తారని అలాగే మీ వాట్సాప్ నెంబర్ ద్వారా ఇతరులకు మీరు అప్పు అడిగినట్లుగా సందేశాలు మీ మిత్రులకు పంపుతారని ఇది సైబర్ నేరగాళ్ల పని అని గ్రహించి మాకు కానీ సంబంధిత డయల్ నెంబర్ గాని ఫోన్ చేసి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో వ్యక్తిగత వివరాలు ఫోటోలు అనవసరంగా యువత పెట్టొద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ఐ కృష్ణ మారుతి, కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ రాజు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .




