Sunday, March 29, 2026

మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండాలి

  • ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి

నేటి సాక్షి, సైదాపూర్: గురువారం మండల కేంద్రం లోని స్త్రీ శక్తి భవనం సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయంలో ఏపిఎం చెన్నబోయిన కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సమ్మురజిత ల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా పై గ్రామ సంఘాల అధ్యక్షులు, వి ఓ ఏ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లల నుండి వయసు పై బడిన వాళ్ళ వరకు అపహరణకు గురి అవుతున్నారని, ప్రలోభాలు, ఉపాధి అవకాశాలు, మంచి వేతనం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి అక్రమ రవాణా చేసే సంఘటనలు చూస్తున్నామని, మహిళలు వారి వారి పిల్లలకు స్వశక్తి మహిళలకు భారత న్యాయ సంహిత పై అవగాహన కల్పించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ మోసాలు బాగా జరుగుతున్నాయని సోషల్ మీడియా ఆప్ ల ద్వారా జాగ్రత్తగా ఉండాలని, కమిటీల ద్వారా అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇక్కడ సీసీ లు ఉప్పుల దేవేందర్ అనపురం రమేశ్, పర్శరాములు, రంజిత్, రాజేశ్వరి,ఎంఎస్ ఓబీ సునయన, సి ఓ కిషోర్, ఎం ఎస్ఏ గీతారాణి, విఓఏ లు, వి ఓ అధ్యక్షురాల్లు, అటెండర్ వెంకటేష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News