నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్‌లో ఫిబ్రవరి 14, 2025 (గురువారం) ఉదయం 10:00 గంటలకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశం జరుగనుందని మండల పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ గారు హాజరవుతారని మండలంలోని తాజా మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, సొసైటీ సభ్యులు, మాజీ మార్కెట్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ అనుబంధ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.





