నేటి సాక్షి, జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి నర్సింలు ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు, పదో తరగతి పూర్వ విద్యార్థులు కలిసి మంగళవారం నర్సింలు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ. 24 వేల ఆర్థిక సహాయం అందించారు. నర్సింలు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

