Saturday, March 21, 2026

బేటి బచావో – బేటి పడావో 10 సంవత్సరాల వారోత్సవాలు

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత బృందం వారు బేటి బచావో బేటి పడావో 10 సంవత్సరాల వారోత్సవాలు లో భాగంగా గొల్లపల్లి అంగన్వాడి సెంటర్లో గర్భస్ర శిశు లింగ నిర్ధారణ చట్టం 1994 అవగాహన కార్యక్రమం గర్భిణీ స్త్రీలకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ గౌతమి మాట్లాడుతూ గర్భస్ర శిశు లింగ నిర్ధారణ చట్టం 1994 గురించి వివరించడం జరిగింది, మిషన్ శక్తి స్కీమ్ గురించి మహిళా సాధికారత గురించి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అందించే సేవలు గురించి సఖి గురించి చైల్డ్ హెల్ప్ లైన్ ల గురించి లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వారికి తెలపడం జరిగింది మరియు ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. మరియు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 గురించి, సఖి సెంటర్ 181 చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి జానకి సూపర్వైజర్ శ్రీమతి జ్యోతి సూపర్వైజర్, మహిళా సాధికారత కేంద్రం టీమ్ శ్రీమతి గౌతమి జెండర్ స్పెషలిస్ట్, సఖి కేస్ వర్కర్ శ్రీమతి శారద చైల్డ్ హెల్ప్ లైన్ శ్రీమతి మానస కౌన్సిలర్ అంగన్వాడి టీచర్స్ గర్భిణి స్త్రీలు మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News