Thursday, March 19, 2026

పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న బేటి బచావో బేటి పడావో

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికార కేంద్ర బృందం నిర్వహిస్తున్న 10 ఇయర్స్ బేటి బచావో బేటి పడావో, కార్యక్రమంలో భాగంగా బుధవారం కోరుట్ల అర్బన్ జిల్లా పరిషత్ మరియు. మోహన్ రావు పేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు మెంటల్ హెల్త్, మొటివేషనల్ ఇన్స్పిరేషనల్ గురించి గౌతమ్ కుమార్ సైకాలజిస్ట్ వివరించడం జరిగింది. మరియు మహిళా సాధికారత సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మాట్లాడుతూ ఏ సందర్భంలోనైనా క్రింది ఈ హెల్ప్ లైన్ ఫిర్యాదు చేయాలని తెలిపారు. Women help line 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సైబర్ క్రైమ్ 1930, ఈ కార్యక్రమంలో స్కూల్ HM. కృష్ణ మూర్తి, ఆనంద రావు, ఉపాధ్యాయులు, ఐసిడిస్ సూపర్వైజర్స్ భారతి, షామీన్ సుల్తానా, అంగన్ వాడి టీచర్లు, జిల్లా మహిళా సాధికారత కేంద్ర బృందం గౌతమి, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మానస పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News