- జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సమాజి దేవేందర్
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, (సందెల రాజు) : ప్రభుత్వం కొత్త మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయబోతుందని, అందుకు మీసేవ వెబ్ సైట్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మీ సేవ సెంటర్ నిర్వాహణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతూ మోసగాళ్లు నకిలీ మీసేవ పోర్టల్ ను కూడా రూపొందించారని తెలిపారు. ఆ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతున్నారని ఈ విషయమై కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని, నకిలీ వెబ్ సైట్ ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నకిలీ వెబ్ సైట్ కి ఎలాంటి వ్యక్తిగత సమాచారమూ ఇవ్వవద్దని, డబ్బులు చెల్లింపు చేసి మోసపోవద్దని ఆయన తెలిపారు.





