
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ హోం డెలివరీ చేస్తుంది. హుజురాబాద్ డిపో లో మంగళవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ గారు ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర మౌళి వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర మౌళి : 9154298559, హుజురాబాద్ కౌంటర్ : 9281471199, జమ్మికుంట కౌంటర్ : 9014363256 ఫోన్ నంబర్లైను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర మౌళి, రవీందర్ రెడ్డి సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ఆఫీస్ సూపరిండెంట్(P), అకౌంటెంట్ (F), రమేష్ బాబు(ADC), రాజేశం (RT), రమేష్ సిస్టం సూపర్ వైజర్ తదితరులు పాల్గొన్నారు.





