నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ చేనేత సహకార సంఘంలో “శ్రీ భక్త మార్కండేయ స్వామి” జయంతి సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్ ఆధ్వర్యంలో “శ్రీ మార్కండేయ స్వామి పూజ కార్యక్రమాలు” పూజారి కుసుమ నాగరాజు చే ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు వేముల యాదగిరి మరియు సంఘం మేనేజర్ నక్క వైకుంఠం, రాజగోపాల్, గుండేటి దేవయ్య తో పాటూ పద్మ శాలి సంఘం నాయకులు సబ్బని రాజేందర్, పద్మ శాలి సేవా సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, కూరపాటి రామచంద్రం మరియు సంఘం నేత కార్మికులు, కూలబంధవులు పాల్గొన్నారు.





