నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నప్రకటించిన రోజును పురస్కరించుకుని పట్టణంలో ని అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించి స్వీట్స్ పంచి పెట్టారు. స్థానిక పివి సేవాసమితి, సిద్ధార్థ నగర్ కాలని అధ్యక్షులు సాగి వీరభద్రరావ్ తూము వెంకట రెడ్డిలు ముందుగా పివి చిత్రపటానికి పూలమాల వేసి ..పివి పై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పివి ఈ దేశానికి అందించిన విశిష్ట సేవలను ప్రజలకు గుర్తు చేశారు. బహుభాషా కోవిధుడుగా,అపర చానిక్యూనిగా ..వారికి ఉన్న రాజకీయ అనుభవంతో ఈ దేశానికి ఎనలేని సేవ లందించారని అన్నారు. వారిని భారతరత్న తో గౌరవించడం తెలుగు వారికి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి.మనోజ్, డా, తోగరువిద్యాసాగర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు వేల్పులరత్నం, పీడీ రాజిరెడ్డి, సబ్బని శివాజీతో పాటు సీడ్స్ సంపత్ రావ్ , వి. ప్రభాకర్, పసులస్వామి, యు రాజమౌళి, గౌరి శంకర్, నమశ్శివాయ, సుధాకర్ గౌడ్ ,కె. అనిరుద్ రెడ్డి, ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.





