
నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : నిజామాబాద్ నగరంలోని పోలీస్ లైన్ లో, 2 కోట్ల 10 లక్షల రూపాయల ఖర్చుతో, నిర్మించిన భరోసా కేంద్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, డిజిపి జితేందర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇన్చార్జి సిపి లతో కలిసి, భరోసా కేంద్రాన్ని, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, భరోసా సెంటర్ ద్వారా, విద్యార్థినిలు, మహిళలకు, ఉద్యోగినులకు, పూర్తి రక్షణ కల్పించే విధంగా పోలీసు శాఖ సేవలు ఉంటాయని మంత్రి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని, ఎల్లమ్మ గుట్ట పోలీస్ లైన్ లో భరోసా కేంద్రానిర్మాన్ని నిర్మించామని జూపల్లి తెలిపారు. భరోసా కేంద్రనికి రెండు కోట్ల పది లక్షలు వెచ్చించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూక్ష్మ ఆలోచనతో, ప్రజల కొరకు విద్యార్థినుల కొరకు, మహిళల కొరకు, ఉద్యోగినిల కొరకు వారి రక్షణకై చేపట్టిన గొప్ప కార్యక్రమం గా, భరోసా సెంటర్లను పేర్కొనవచ్చని, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు బాలబాలికలు విద్యార్థులు వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. భరోసా కేంద్రాల ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదైన ఫోక్సో కేసులకు అన్నింటికీ కౌన్సిలింగ్ ఇప్పించి, వారికి భరోసా కల్పిస్తున్నామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం సైతం చెల్లిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మీడియా ముఖంగా తెలియజేశారు. విద్యార్థినులు మహిళలు, ఉద్యోగినిలు అందరూ భరోసా కేంద్రం సహాయ సహకారాలు వెనువెంటనే పొందాలని, తద్వారా మహిళలందరికీ భరోసా సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని షబ్బీర్ అలీ ఆయన అన్నారు. రాష్ట్ర డిజిపి జితేందర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్లో ప్రొఫెషనల్ స్టాప్ 216 మంది, పోలీస్ స్టాప్ 29 మంది, క్లినికల్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్లో 2 భరోసా పిఎంయు స్టాప్, 7 మెంబర్స్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని వారి సేవలను జిల్లా ప్రజలు, మహిళలు, విద్యార్థినులు, అందరూ ఉపయోగించుకోవాలని, డిజిపి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,910 ఫోక్సో కేసులు, ఒక్క 1, 770 రెఫ్ కేసులు, గృహహింస నిర్బంధ కేసులు, ఇతర కేసులు కలుపుకొని, 11663 కేసులు నమోదైనట్లు డిజిపి తెలిపారు. ఇప్పటివరకు 290 మందికి శిక్ష విధించడం జరిగిందని, డీజీపీ అన్నారు. 4,516 మంది బాధితులకు నష్టపరిహారం కొరకు వినతులు వచ్చాయని, 2,411 మందికి ఏడుకోట్ల 32 లక్షల 87 వేల రూపాయలు బాధితులకు నష్టపరిహారం అందించడం జరిగిందని, డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 భరోసా సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఆయన తెలిపారు. ఇందులో 10 శాశ్వత భవనాలు ఉండగా నిజామాబాద్ జిల్లాలోని, భరోసా కేంద్రం శాశ్వత భవనాలలో ఒకటి అని డిజిపి తెలిపారు. కార్యక్రమంలో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఐ జి చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




