కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్
నేతి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): జనవరి 26
నిత్యం వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికై ముందుంటానని 30 వ వార్డు కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హుజురాబాద్ స్థానిక మున్సిపల్ పట్టణంలోని 30 వ వార్డు లోని విద్యానగర్ లో మున్సిపల్ నిధుల నుండి మంజూరైన రూ. 5 లక్షలతో ఆదివారం దాస్యం రామస్వామి ఇంటి నుండి మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ వరకు నూతనంగా డ్రైనేజీని నిర్మించడానికి స్థానిక కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక – శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ ఇంజనీర్ సాంబరాజు, దత్తు, వార్డు ప్రజలు దాస్యం రామస్వామి, నార్ల గిరి కిషన్, శ్రావణ్, గణేష్, సంకోజు రాజయ్య, రామారపు సదానందం, కాంట్రాక్టర్ కోయడ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.





