- ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ప్రపంచ వినియోగదారుల హక్కుల కమిటీ
నేటిసాక్షి, ములుగు, మంగపేట : ప్రపంచ వినియోగదారుల హక్కుల సమావేశం ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాంతోష్ అధ్యక్షతన సమావేశం జరుగగా ముఖ్యఅతిథిగా వ్యవస్థాపకులు చైర్మన్ నల్లమస శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు ఈ సమావేశంలో వరల్డ్ కన్స్యూమర్ రైట్ డిప్యూటీ చైర్మన్ గా భూక్య జంపన్న కు నియామక పత్రం అందజేశారు అనంతరం జంపన్న మాట్లాడుతూ నాణ్యత లోపించిన వస్తువులు కొనుగోలు చేసి వాడడం వలన విషపురితం అయ్యే అవకాశం ఉంది అలా అమ్మిన వారిని వినియోగదారుడు ప్రశ్నించాలి. ఒక వస్తువు పట్ల ప్రశ్నించినప్పుడే నాణ్యత లోపించకుండా ఉంచడం జరుగుతుంది. వినియోగదారుల సమస్యలు తీర్చటంలో ప్రభుత్వానికి వినియోగదారునికి మధ్య వారిదిగా ప్రపంచ వినియోగదారుల హక్కుల కమిటీ తరఫున పనిచేస్తామని వస్తు సేవల వినియోగంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా నిత్యం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పిస్తామని తెలియజే శారు. ప్రపంచ వినియోదారులలో హక్కులు అవకాశం కల్పించినందుకు జాతీయ ప్రపంచ వినియోదారుల హక్కుల సంఘం కమిటీ వారికి కృతజ్ఞతలు భూక్యా జంపన్న తెలియజేశారు.





