Sunday, March 29, 2026

ముగిసిన భూలక్మి మహలక్ష్మి పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలు

నేటి సాక్షి వీణవంక : వీణవంక మండలంలోని బేతిగల్ లో నాలుగు రోజులుగా జరుగుతున్న భూలక్మి మహలక్ష్మి బొడ్రాయి పోచమ్మ ప్రతిష్టాన పండగ గురువారం ముగ్గుసింది. ఉదయం నాలుగు గంటల సమయం లోనే అర్చకులు నరసింహచర్యులు ఆధ్వర్యంలో విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. అంతరం భూలక్మి మహలక్ష్మి బొడ్రాయి పూజ చేశారు. మహిళలు మంగళహారతిలతో వచ్చి యాగశాలా వద్ద మొక్కులు చెల్లించుకొని బొడ్రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. పోచమ్మ బోనాలు మధ్యాహ్నం 12 గంటలకు బేతిగల్ ఊరు వడ వాడల్లొ నుంచి బోనాలతో పంబాల డప్పు సాప్పులతో అట పాటలలో తరలి వెళ్లారు.. పోచమ్మ తల్లి ఆలయలంలో మహిళలు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పోచమ్మ ఆలయంలో పంబాల వాళ్లు కథ చెప్పి గావు పట్టారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News