
నేటి సాక్షి ప్రతినిధి ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆళ్లగడ్డ తాలూకా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ అహోబిలం క్షేత్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన గ్రామీణ వైద్యులను, రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రతినిధులను భూమా అభినందించారు. ప్రతి ఏటా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రథోత్సవం సందర్భంగా ఊరంతా పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబుకు, టీడీపీ నాయకులకు, ఈరోజు ప్రజలు అంతా సుఖశాంతులతో జీవించాలని భూమా ఆకాంక్షించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యులకు తమ సహాయ సహకారాలు కోరితే తప్పకుండా అందిస్తామని భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు దేవుని దర్శించుకునేందుకు వచ్చిన వేలాదిమంది భక్తులకు గ్రామీణ ఆళ్లగడ్డ గ్రామీణ వైద్యుల సంఘం వైద్యులు ప్రైమ్ కేర్ హాస్పిటల్ సహకారంతో , ఫ్రేమ్ కేర్ హాస్పిటల్ మేనేజర్ శేఖర్ బిపి షుగర్ తదితర రక్త పరీక్షలు అనంతరం వైద్యులురోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పర్ల దస్తగిరి, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు వెంకటేశ్వర్లు, విజయ కాంత్ రెడ్డి తిరుపాల్ ఈశ్వర్ వీరేష్ గురప్ప శ్రీనివాసులు మద్దిలేటి యోగి, దొర్నిపాడు మండల గ్రామీణ వైద్యుల సంఘం నాగేంద్ర ,నంద్యాల రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





