నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామానికి చెందిన రాఘవరెడ్డి కోళ్ల ఫామ్స్ అధినేత ఈశ్వర్ రెడ్డి(50) శుక్రవారం తెల్లవారు జామున ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబీకుల సమాచారం మేరకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ఆ గ్రామానికి చేరుకుని ఈశ్వర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈశ్వర్ రెడ్డి మరణంతో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.



