సమాధి వద్దనివాళులర్పించిన మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్):
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికి 15 ఏళ్లు అయ్యింది 2010లో నేటి రోజున రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులినాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య 19 ఏళ్ల వయసులో ఓ హాస్టల్ లో పని చేసుకుంటూ చదువుకునే రోజులలో తెలంగాణ కోసం ఆమురడయ్యాడు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి సిరిపురం యాదయ్యకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పెద్దపులి నాగారం గ్రామంలో సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించి జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ… జోహార్ యాదయ్య ఈ యొక్క కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మాజీ సర్పంచులు మాజీ వార్డు మెంబర్లు పద్మశాలి సంఘం నాయకులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు నాయకులు శ్రద్ధాంజలి తెలియజేశారు. జై తెలంగాణ జై జై తెలంగాణ.





